Share News

ఘనంగా అక్షయ తృతీయ వేడుకలు

ABN , Publish Date - May 01 , 2025 | 12:32 AM

రాఘవేంద్రస్వామి సన్నిధానంలో అక్షయతృతీయ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా అక్షయ తృతీయ వేడుకలు
బంగారు బిందెల్లో గంధాన్ని ఊరేగింపుగా తెస్తున్న పీఠాధిపతి, పండితులు

శ్రీమఠం చుట్టూ గంధం ఊరేగింపు

మంత్రాలయం, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి సన్నిధానంలో అక్షయతృతీయ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో బంగారు ఆండాల్లో సిద్ధపరిచిన గంధాన్ని శ్రీమఠం చుట్టూ వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపు నిర్వహిం చారు. పీఠాధిపతి రాఘవేంద్రస్వామికి, వాధేంధ్రతీర్థులకు, ఆంజనేయ స్వామికి, మంచాలమ్మకు, పూర్వపు పీఠాధిపతి బృందావనాలకు గంధ లేపన మహోత్సవం చేశారు. బృందావనాలకు గంధం అలంకరించి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మహా మంగళహారతులు ఇచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు గంధలేపన మహోత్సవంలో పాల్గొని తరించారు. పీఠాధిపతి భక్తులకు శేషవస్త్రం, ఫల పుష్ప మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో పండిత కేసరి విద్వాన రాజాఎస్‌ గిరిరాజాచార్‌, అప్రమేయాచార్‌, ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు వెంకటేశ జోషి, సురేష్‌ కోనా పూర్‌, శ్రీపతాచార్‌, ఐపీ నరసింహమూర్తి, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధాకర్‌ రెడ్డి, ఇన్సపెక్టర్లు వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్లు అనంతపురాణిక్‌, రవికులకర్ణి, విజయేంద్రాచార్‌, ద్వారపాలక అనంత స్వామి, బద్రినాథ్‌, వాధేంద్రాచార్‌ పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2025 | 12:32 AM