Share News

సారా నిర్మూలనే లక్ష్యం : ఎక్సైజ్‌ సీఐ

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:25 AM

సారా నిర్మూలనే లక్ష్యమని ఎక్సైజ్‌ సీఐ చంద్రహాస్‌ తెలిపారు. ఆదివారం నగంరలోని బంగారుపేటలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో పికెటింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

సారా నిర్మూలనే లక్ష్యం : ఎక్సైజ్‌ సీఐ
బంగారుపేటలో ఎక్సైజ్‌ పికెటింగ్‌

కర్నూలు అర్బన్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సారా నిర్మూలనే లక్ష్యమని ఎక్సైజ్‌ సీఐ చంద్రహాస్‌ తెలిపారు. ఆదివారం నగంరలోని బంగారుపేటలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో పికెటింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. బాధితులకు సారావిముక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సారా విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకునే ఉద్దేశ్యంతో బంగారుపేట నిఘా ఉంచామన్నారు. సారా రహిత బంగారుపేట లక్ష్యమని తెలిపారు. సారా తయారీ, విక్రయమ మానితే ఉపాధి చూపుతామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రెహనబేగం, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 12:25 AM