Share News

మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తాం

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:24 PM

మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తాం
డ్వాక్రా మహిళలకు చెక్కును అందిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

డ్వాక్రా సంఘాలను బీజం వేసింది సీఎం చంద్రబాబు నాయుడు

రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి రూ.124.29కోట్ల చెక్‌ పంపిణీ

కొలిమిగుండ్ల, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కొలిమిగుండ్లలోని స్ర్తీ శక్తి విజయోత్సవ ర్యాలీలో మహిళలతో కలిసి మంత్రి బీసీ పాల్గొన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి కలిసి డ్వాక్రా సంఘాలతో ప్రత్యేక సమావేశం మంత్రి నిర్వహించారు. ఈసందర్భంగా బనగానపల్లె నియోజకవర్గానికి బ్యాంకు రుణాల ద్వారా మంజూరైన రూ.124.29కోట్లు మెగా చెక్‌ను మహిళా సంఘాలకు మంత్రి బీసీ అందజేశారు. డ్వాక్రా సంఘాలకు బీజం వేసింది సీఎం చంద్రబాబు నాయుడు అని అన్నారు. జిల్యా వ్యాప్తంగా 30,680 డ్వాక్రా సంఘాలుండగా, 14,080 సంఘాలకు రూ.1,200కోట్లు రుణాలు అందించడానికి ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. తద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం వనగూరుతుందని అన్నారు. డ్వాక్రా సంఘాలు చంద్రబాబు మానస పుత్రికలని, వారి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఎంతో తపిస్తున్నారని బీసీ అన్నారు. మరోవైపు పింఛన్లపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో తొలగింపు జాబితాలో ఉన్న పింఛన్లు మొత్తం పింఛన్లులో కేవలం 1శాతం మాత్రమేనని అన్నారు. పింఛన్ల పై మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదని మంత్రి హెచ్చరిం చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీని వాసులు, ఎంపీడీవో ప్రసాదరెడ్డి, టీడీపీ నాయులు మూలే రామేశ్వరరెడ్డి, వీఆర్‌ లక్ష్మీరెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, గూలి నాగేశ్వరరెడ్డి, పెట్నీకోట హుస్సేన్‌రెడ్డి, రవిప్రకాశ్‌రెడ్డి, వివేకానందరెడ్డి, కామిని క్రిష్ణరంగారెడ్డి, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 11:24 PM