Share News

ఏజెంట్లను త్వరగా నియమించుకోవాలి

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:22 PM

రాజకీయ పార్టీలు బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను త్వరగా నియమించు కోవాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు.

ఏజెంట్లను త్వరగా నియమించుకోవాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌

కర్నూలు కలెక్టరేట్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలు బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను త్వరగా నియమించు కోవాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబరులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో త్వరలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ జరగనుందన్నారు. బూత్‌ లెవెల్‌ ఆఫీసర్ల నియామకాన్ని చేపట్టి వారికి శిక్షణ కూడా పూర్తి చేశామన్నారు. అలాగే రాజకీయ పార్టీలు కూడా బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను నియమించుకుని శిక్షణ ఇవ్వాలని సూచించారు. 1200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాలను హేతుబద్దీక రించాలన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో కొత్తగా 237 పోలింగ్‌ కేంద్రాలను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇప్పటికే 2203 పోలింగ్‌ స్టేషన్‌లు ఉండగా.. కొత్తగా ప్రతిపాదించిన పోలింగ్‌ కేంద్రాలను కలిపితే మొత్తం 2440 కేంద్రాలు అవుతాయన్నారు. కొత్తగా ప్రతిపాదించిన పోలింగ్‌ స్టేషన్‌ల ఏర్పాటు, స్థాన మార్పు, నామకరణ మార్పు మొదలైన వాటికి సంబంధించి ఏవైనా సూచనలు ఉంటే.. నేరుగా ఈఆర్వో లేదా జిల్లా ఎన్నికల అధికారికి ఇవ్వాలని రాజకీ య పార్టీల ప్రతినిధులకు కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, టీడీపీ పార్టీ ప్రతినిధి ఎల్‌వీ ప్రసాద్‌, బహుజన సమాజ్‌వాద్‌ పార్టీ జిల్లా ఇన్‌చార్జి అరుణ్‌కుమార్‌, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున బజారన్న, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ మురళి హాజరయ్యారు.

Updated Date - Aug 30 , 2025 | 11:22 PM