Share News

అందుబాటులో అత్యాధునిక చికిత్సలు

ABN , Publish Date - May 15 , 2025 | 12:02 AM

కర్నూలు స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రాష్ట్రంలోనే అత్యాధునిక క్యాన్సర్‌ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు తెలిపారు.

అందుబాటులో అత్యాధునిక చికిత్సలు
ఆపరేషన్‌ థియేటర్‌ కాంప్లెక్స్‌ను పరిశీలిస్తున్న సూపరింటెండెంట్‌

కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు

స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సర్జరీ సేవలు ప్రారంభం

కర్నూలు హాస్పిటల్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): కర్నూలు స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రాష్ట్రంలోనే అత్యాధునిక క్యాన్సర్‌ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం స్టేట్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో సర్జరీ సేవలను ఆయన క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణప్రకాష్‌తో కలిసి ప్రారంభిం చారు. కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తోందని, సర్జికల్‌ అంకాలజీ, జనరల్‌ అంకాలజీలలో ఆపరేషన్లను వైద్యులు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోనే గర్వించదగ్గ హాస్పిటల్‌ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేన్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు జీజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ బీవీ రావు, స్టేట్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ బి.హేమనళిని, అనస్థీషియా హెచ్‌వోడీ డా.విశాల, ప్రొఫెసర్‌ డా.రామశివ నాయక్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్‌ డా.కిరణ్‌ కుమార్‌, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 12:02 AM