Share News

శ్వాసకోశ వ్యాధులకు ఆధునిక చికిత్స

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:21 AM

శ్వాసకోశ వ్యాధులకు ఆధునికి చికిత్స అందుబాటులో ఉందని హైటెక్‌ సిటీ యశోధ హాస్పిటల్స్‌ క్ల్లినికల్‌ అండ్‌ ఇంటర్వేన్షనల్‌ పల్మనాలజిస్టు డా.వెంకట నాగార్జున మాటూరు అన్నారు.

శ్వాసకోశ వ్యాధులకు ఆధునిక చికిత్స
రీజనల్‌ పల్మనాలజీ సదస్సును ప్రారంభిస్తున్న వైద్యులు

కర్నూలులో రీజనల్‌ పల్మనాలజీ సదస్సు

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): శ్వాసకోశ వ్యాధులకు ఆధునికి చికిత్స అందుబాటులో ఉందని హైటెక్‌ సిటీ యశోధ హాస్పిటల్స్‌ క్ల్లినికల్‌ అండ్‌ ఇంటర్వేన్షనల్‌ పల్మనాలజిస్టు డా.వెంకట నాగార్జున మాటూరు అన్నారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో రాయలసీమ రీజనల్‌ పల్మనాలజీ అప్‌డేట్‌-2025 వైద్యుల సదస్సు నిర్వహించారు. జీవనశైలి మార్పు, కాలుష్యం, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతో ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు పెరిగి మరణాలకు కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సింగిల్‌ ఇన్‌హేలర్లు, ట్రిపుల్‌ థెరపీ, బయోలాడ్స్‌ రాకతో ఆస్తమా, సీవోపీడీ చికిత్సలు విప్లవాత్మకంగా మారాయన్నారు. కోవిడ్‌ అనంతరం పల్మనాలజిలో క్రిటికల్‌ కేర్‌లో ఆధునిక చికిత్సలు అందుబాటులో వచ్చాయన్నారు దేశంలో మొదటిసారిగా నావిగేషనల్‌ బ్రోంకోస్కోపి, కోన్‌భీమ్‌, సిటీ గైడెడ్‌, బయాప్సీ, బయోడిగ్రేడబుల్‌, స్టంట్లు నూతనంగా వచ్చాయన్నారు. వైద్యులు డా.వెంకటరమణ కోలా, కార్పొరేట్‌ రిలేషన్‌ జీఎం ప్రదీప్‌ గౌడు, కర్నూలు చెందిన ఫల్మనాలజిస్టులు డా.కుళ్లాయప్ప, డా.సి.శ్రీనివాసరెడ్డి, డా.ఎం.శైలజ, డా.నెమలి రవికుమార్‌ రెడ్డి, డా.సుబ్బారావు, సీనియర్‌ ఫిజీషియన్‌, డా.మాలకొండయ్య, డా.ఎస్‌.ఎన్‌ ఖాద్రి, కడప అనంతపురం, బళ్లారి, రాయచూరు, మహబూబ్‌ నగర్‌, గద్వాల, వనపర్తి, జిల్లా నగర్‌ కర్నూలు జిల్లాల నుంచి ఫల్మనాలజిస్టులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 12:26 AM