కల్తీ నెయ్యి స్వాధీనం
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:20 AM
సుమారు 8 కేజీల కల్తీ నెయ్యి పట్టుకొని ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.
ఇద్దరు మహిళలు అరెస్టు
నందికొట్కూరు రూరల్, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): సుమారు 8 కేజీల కల్తీ నెయ్యి పట్టుకొని ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. బ్రాహ్మణకొట్కూరు ఎస్‌ఐ మణికంఠ తెలిపిన వివరాలివీ.. బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో ఇద్దరు మహిళలు కల్తీ నెయ్యిని అమ్ముతున్నారన్న సమాచారం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మురళీనగర్ తండాకు చెందిన కమలమ్మ, నందికొట్కూరు మండలంలో కోళ్ల బావాపురం గ్రామానికి చెందిన సుంకమ్మను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రెండు పెద్ద బకెట్‌లలో దాదాపుగా 8 కేజీల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడుతో కలిసి నెయ్యిని పరీక్షించామని, ఇది కల్తీ నెయ్యి అని తేలిందని ఎస్‌ఐ చెప్పారు. దీంతో ఇద్దరు మహిళలపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం కల్తీ నెయ్యిని రాష్ట్ర ఫుడ్ ల్యాబోరేటరీకి పంపుతున్నట్లు తెలిపారు.