Share News

కొత్త బంగారు లోకం!

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:37 PM

పదో తరగతి పాసైన విద్యార్థులు కొత్త బంగారులోకంలోకి అడుగు పెట్టారు. ఎన్నో ఆశలతో ఇంటర్మీడియట్‌ కోర్సులో ప్రవేశం పొంది కళాశాలకు వచ్చారు.

కొత్త బంగారు లోకం!
బాలికల కళశాలలో విద్యార్థినుల ప్రవేశాలు

ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభం

బైపీసీ, ఎంపీసీ గ్రూపులకే డిమాండ్‌

ఆదోని అగ్రికల్చర్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పాసైన విద్యార్థులు కొత్త బంగారులోకంలోకి అడుగు పెట్టారు. ఎన్నో ఆశలతో ఇంటర్మీడియట్‌ కోర్సులో ప్రవేశం పొంది కళాశాలకు వచ్చారు. సోమవారం నుంచి కళాశాలలు పునఃప్రారంభమయ్యాయి. బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూపులుండగా, ప్రధానంగా బైపీసీ, ఎంపీసీ గ్రూపులకే డిమాండ్‌ ఉంది. పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల తో పాటు ప్రైవేటు కళాశాలలు 9 ఉన్నాయి. వీటితోపాటు కౌతాళం, హోళగుంద, కోసిగి, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

పరీక్షలు పూర్తికాగానే తరగతులు

టీడీపీ ప్రభుత్వం వచ్చాక పదో తరగతి పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్‌లోనే ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు అవకాశం కల్పించింది. విద్యార్థుల్లో కొందరు హాల్‌టికెట్లతో కళాశాలలో చేరారు. ఇప్పటికే వీరికి అవసరమైన పాఠ్యపుస్తకాలు సిద్ధం చేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది.

దరఖాస్తు చేసుకోండి

పదో తరగతి పాస్‌ అయిన విద్యార్థినులు ఇంటర్మీడి యట్‌ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోండి. ఇప్పటికే క్లాసులు ప్రారంభమయ్యాయి. - సంజన్న, ప్రిన్సిపాల్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, ఆదోని

Updated Date - Jun 02 , 2025 | 11:37 PM