Share News

రబీకి సరిపడే యూరియా నిల్వలు

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:34 PM

జిల్లాలో రబీకి సరిపడా యూరియా నిల్వలున్నాయని జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) నున్నా వెంకటేశ్వర్లు అన్నారు.

రబీకి సరిపడే యూరియా నిల్వలు
రికార్డులను పరిశీలిస్తున్న డీఏవో

డీఏవో వెంకటేశ్వర్లు

నంద్యాల ఎడ్యుకేషన్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రబీకి సరిపడా యూరియా నిల్వలున్నాయని జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) నున్నా వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రాబోయే రబీకి 68,777 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా నేటి వరకు మొత్తం 23,049 మెట్రిక్‌ టన్నుల యూరియా విక్రయించారన్నారు. ప్రస్తుతం 13,865 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదన్నారు. డీలర్లు నిబంధనలు ఉల్లంఘించి ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా ఎరువులను మళ్లించినా కఠిన చర్యలు తప్పవన్నారు.

ఎరువుల దుకాణాలు తనిఖీ

నంద్యాల పట్టణంలోని పలు ఎరువులు, పురుగుల మందుల దుకాణాలను డీఏవో వెంకటేశ్వర్లు తనిఖీచేశారు. శివసంతోష్‌రెడ్డి ఏజన్సీస్‌, దుర్గాభ వాని ఫర్టిలైజర్స్‌ దుకాణాల్లో స్టాక్‌ రిజిస్టర్‌, బిల్‌బుక్స్‌, రసీదులను, బయో ఉత్పత్తు లకు సంబం ధించిన అనుమతి పత్రాలను, నిల్వలను పరిశీలించారు. సరైన ధ్రువప త్రాలు లేని రూ.1,34,002ల బయో ఉత్పత్తుల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. ప్రభుత్వ అనుమతితోనే బయో ఉత్పత్తులను విక్రయించాలని షాపుల యాజమానులను హెచ్చరించామని అన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 11:34 PM