కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:16 PM
టీడీపీకి నిస్వార్థంగా కష్టపడి పని చేసే కార్యకర్తలే పట్టుకొమ్మలని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): టీడీపీకి నిస్వార్థంగా కష్టపడి పని చేసే కార్యకర్తలే పట్టుకొమ్మలని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. గురువారం స్థానిక రాజ్ టాకీస్‌లోని టీడీపీ కార్యాలయంలో నూతనంగా ఏర్పడిన క్లస్టర్లు, యూనిట్, గ్రామ, బూత్ కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రావడానికి పార్టీ ఆమలు చేస్తున్న క్లస్టర్ల, యూనిట్ వ్యవస్థ కీలక పాత్ర పోషించిం దన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ వ్యవస్థ బాగా పని చేసిందన్నారు. పదవులు రాని వారు కూడా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్‌ఎండీ ఫయాజ్, కొట్టాల శివనాగిరెడ్డి, ఏవీఆర్ ప్రసాద్, తాతిరెడ్డి తులసిరెడ్డి పాల్గొన్నారు.