యూరియా కొరత సృష్టిస్తే చర్యలు
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:19 AM
జిల్లాలో యూరియా నిల్వలు రైతులకు అవసరమైనంత మొత్తంలో ఉన్నాయని, యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి హెచ్చరిం చారు.
వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా నిల్వలు రైతులకు అవసరమైనంత మొత్తంలో ఉన్నాయని, యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి హెచ్చరిం చారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు సప్లయ్ అవుతున్న యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల్లో 50 శాతం మార్క్‌ఫెడ్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, డీసీఎంఎస్ కేంద్రాలు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మిగిలిన 50 శాతం ఎరువులను ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకే అవసరమైనంత యూరి యాను మాత్రమే రైతులు పొలాల్లో వాడాలని సూచించారు. బస్తా యూరియా ధర రూ.266లు అని, ఈమొత్తానికి మించి ఎక్కడైనా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని, క్రిమినల్ కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతు సేవాకేంద్రాలతో పాటు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, డీసీఎంఎస్ కేంద్రాల్లో ఎక్కడైనా ఎరువులను పక్కదారి పట్టిస్తే మండల వ్యవసాయాధికారులు, ఏడీఏలు విచారణ జరిపి సంబంధిత కేంద్రాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.