నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు: సీఐ
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:30 PM
వాహనదారులు రోడ్డు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని కౌతాళం సీఐ అశోక్ కుమార్ హెచ్చరించారు.
కౌతాళం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): వాహనదారులు రోడ్డు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని కౌతాళం సీఐ అశోక్ కుమార్ హెచ్చరించారు. బుధవారం కౌతాళంలో రోడ్డు భద్రత నియ మాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముందుగా కౌతాళంలోని ప్రతిభ హైస్కూల్ విద్యార్థులతో కలిసి వీధుల్లో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో పోలీసులు మద్దిలేటి, రామాంజనేయులు, సోమ్లా నాయక్, రంగన్న పాల్గొన్నారు.
గోనెగండ్ల: ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సీఐ చంద్రబాబు సూచించారు. బుధవారం గోనెగండ్లలోని వీధుల గుండా ఉన్నత పాఠశాల విద్యార్థులు, పోలీసు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈవో నీల కంఠ, హెచఎం నాగభూష ణం, ఉపాధ్యాయులు, పోలీసు లు పాల్గొన్నారు.
పెద్దకడబూరు: రోడ్డు భద్రతపై వాహనాదారులు, ప్రజలు అవగాహన కలిగి ఉం డాలని ఎస్‌ఐ నిరంజన రెడ్డి అన్నారు. మంగళవారం ఎస్‌ఐ తోపాటు పోలీస్ సిబ్బంది, విద్యార్థులతో కలిసి పెద్దకడబూరులో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ శివరాం, సిబ్బంది మురళీకృష్ణ, శరణప్ప పాల్గొన్నారు.
కోసిగి: ప్రజలకు రహదారి భద్రతపై కోసిగి పోలీసులు బుధవా రం కోసిగిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సీఐ మంజునాథ్, ఎస్‌ఐ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కోసిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి జూనియర్ కళాశాల నుంచి వాల్మీకి సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సీఐ మంజునాథ్ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. కార్యక్రమంలో పోలీ సులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.