రోగులను బయటికి పంపితే చర్యలు
ABN , Publish Date - Jul 01 , 2025 | 12:40 AM
మందుల కోసం రోగులను బయటికి పంపితే కఠిన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి
పరిశ్రమలు, వాణిజ్యం శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు జీజీహెచ్ అధికారులతో సమీక్ష
కర్నూలు హాస్పిటల్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): మందుల కోసం రోగులను బయటికి పంపితే కఠిన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. సోమవారం క ర్నూలు మెడికల్ కాలేజీ అడ్మినిస్ర్టేటివ్ బ్లాక్ కాన్ఫ రెన్స్ హాలులో కర్నూలు జీజీహెచ్ వైద్యాధికారు లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో నిర్వహించిన అంశాల వారీగా చర్చించి వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో విద్యుత్ సమస్య ఎక్కడ ఉండకూడదని, ఏఎంసీ, గైనిక్, సూపర్ స్పెషాలిటీ, ఓటీల్లో యూపీఎస్ కనెక్షన్ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. పీజీ హాస్టల్స్ వద్ద, స్ర్టీట్ లైటింగ్, పెద్ద పెద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మను ఆదేశించారు. ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో నిధులు ఉన్నప్పటికీ పరికరాలు కొనుగోలు చేసేందుకు అనుమతులు కావాలని హాస్పిటల్ సూప రింటెండెంట్ డా.పృథ్వి వెంకటేశ్వర్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఉదయం పూట రద్దీ ఎక్కు వగా ఉంటుందని, హాస్పిటల్‌లో పార్కింగ్ స్థలాలను మెరుగు పరచాలని మంత్రి కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లును ఆదేశించారు. వైద్యులు, రోగులు, ఉద్యోగులు విద్యార్థులకు వాహనాలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఉండాలన్నారు. హాస్పిటల్‌లో లీకేజీ స మస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీం ద్రబాబు, కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ డా.కే.చిట్టినరసమ్మ, హాస్పిటల్ అడ్మినిస్ర్టేటర్ పి.సింధు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.