Share News

యూరియాను అక్రమంగా తరలిస్తే చర్యలు

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:08 AM

ఎవరైనా యూరి యాను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ మందా జావళి హెచ్చరించారు.

యూరియాను అక్రమంగా తరలిస్తే చర్యలు
గోదాములను పరిశీలిస్తున్న ఏఎస్పీ, వ్యవసాయ అధికారులు

ఏఎస్పీ మందా జావళి

ఎరువుల దుకాణాలు, గోదాముల ఆకస్మిక తనిఖీలు

నంద్యాల టౌన్‌, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): ఎవరైనా యూరి యాను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ మందా జావళి హెచ్చరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, పోలీసుల శాఖ ఆధ్వర్యంలో ఏకకాలంలో ఎరువుల దుకాణాలు, గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నంద్యాలలో ఏఎస్పీ మందా జావళి, సీఐలు కంబగిరిరాముడు, ఈశ్వరయ్యలతో కలిసి పట్టణంలోని దుకాణాలను, యూరియా నిల్వలను పరిశీలించారు. సరియైున పత్రాలు ఉన్నాయా, లేవా అనుమతులు గురించి అడిగి తెలిసుకున్నారు. ఎక్కవ కూడా అక్రమంగా యూరియాను తరలించరా దన్నారు. రిజిస్టర్లు, నిల్వలు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎక్కడైనా అక్రమంగా ఎరువులు తరలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రసాద్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 12:08 AM