Share News

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Jul 03 , 2025 | 01:08 AM

స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ భారత’పై పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జడ్పీ సీఈవో నాసరరెడ్డి హెచ్చరించారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మాట్లాడుతున్న జడ్పీ సీఈవో నాసరరెడ్డి

జడ్పీ సీఈవో నాసరరెడ్డి

సి.బెళగల్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ భారత’పై పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జడ్పీ సీఈవో నాసరరెడ్డి హెచ్చరించారు. బుధవారం మండల పరిషత కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ భారత’ని ఎంపీడీవోలు పరిశీలించాలని ఆదేశించారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు ఉదయం 7గంటల నుంచి పరిశుభ్రత చేయించినట్లు జిల్లా పంచాయతీ అధికారులకు ఆనలైన ద్వారా ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. పంచాయతీల్లో ఏర్పాటుచేసిన చెత్త సేకరణ కేంద్రాల్లో తడి, పొడి చెత్తను వేరుచేసి దాని నుంచి సేంద్రియ ఎరువులను తయారుచేసి రైతులకు ఉపయోగపడేలా చూడాల్సిన బాధ్యత మనందరిదని ఉందన్నారు. వర్షాకాలం దృష్ట్యా రోడ్ల మీద నీరు నిలవకుండా, మురుగు కాలువలు శుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో రాణెమ్మ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ గోనెనాయక్‌, పీఆర్‌ఏఈ వెంకటప్రకాశ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 01:08 AM