ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:21 AM
: వైద్య విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే.చిట్టి నరసమ్మ హెచ్చరించారు
కేఎంసీ ప్రిన్సిపాల్ ఫ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ వీక్
కర్నూలు హాస్పిటల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే.చిట్టి నరసమ్మ హెచ్చరించారు. యాంటి ర్యాగింగ్ వీక్ సంబరంగా దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలో యూజీసీ, నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాల మేరకు కర్నూలు మెడికల్ కాలేజీలో జూమ్‌లో ర్యాగింగ్ సదస్సు జరిగింది. ఈ సందర్బంగా యాంటి ర్యాగింగ్‌పై ఎన్‌ఎంసీ చైర్మన్ డా.అబిజిత్ సేత్ ప్రతిజ్ఞ చేయించారు. ఆగస్టు 12 నుంచి 18 వరకు యాంటి ర్యాగింగ్ వారోత్సవాలు నిర్వహించాలని ప్రిన్సిపల్ తెలిపారు. ర్యాగింగ్ వల్ల కలిగే నష్టాలను చట్టం ద్వారా తీసుకునే కఠినమైన చర్యల గురించి విద్యార్థులకు వివరించాలన్నారు. వారోతసవాల సందర్బంగా డిజిటల్ పోస్టర్లు, షార్ట్ వీడియోలు, యాంటి ర్యాగింగ్ సందేహాలను హైలెట్ చేసే రీల్స్‌పై దృస్టి పెట్టాలన్నారు. ర్యాగింగ్ వ్యతిరేక సందేహాలను ప్రోత్సహించే సంస్థల నుంచి వీడియో సందేశాలను వినియోగించుకోవాలన్నారు.జూమ్ మీటింగ్‌లో వైస్ ప్రిన్సిపల్ డా.హరిచరణ్, డా.సాయిసుధీర్, డా.రేణుకాదేవి, డా.సింధియా శుభప్రద, యాంటి ర్యాగింగ్ సభ్యులు హెచ్‌వోడీలు, ప్రొఫెసర్లు, పీజీలు, యూజీ విద్యార్థులు పాల్గొన్నారు.