Share News

పన్ను వసూళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు: కమిషనర్‌

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:44 AM

పన్నుల వసూళ్లలో అధికారుల, సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని నగర పాలక కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ హెచ్చరించారు.

పన్ను వసూళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు: కమిషనర్‌
మాట్లాడుతున్న కమిషనర్‌ విశ్వనాథ్‌

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పన్నుల వసూళ్లలో అధికారుల, సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని నగర పాలక కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణతో కలిసి రెవెన్యూ అధికారులు, అడ్మిన కార్యదర్శులతో పన్ను వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బకాయిలు ఉన్న ఆస్తి పన్నులను వెం టనే వసూలు చేయాలన్నారు. మొండి బకాయిల జాబితా అధికంగా ఉన్న అధికారులు, అడ్మిన్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశిం చారు. సమావేశంలో ఆర్‌ఓ వాజిద్‌, ఆర్‌ఐలు జిఎం.శ్రీకాంత, తిప్పన్న, సొహైల్‌, రాజు, శిశశంకర్‌, ఖలీల్‌ పాల్గొన్నారు.

తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు : నగరంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌ విశ్వనాథ్‌ అన్నారు. మంగళవారం నగర పాలక కార్యాల యంలో ప్రజారోగ్య సాంకేతిక, గ్రామీణ తాగునీటి సరఫరా, జలవనరుల శాఖల అధికారులతో పాటు నగరపాలక ఇంజనీరింగ్‌ విభాగం అధికారు లతో సమీక్ష నిర్వహించారు. నగర సమీప ప్రాంతాల్లో ఉన్న నీటి ప్రాజె క్టులు, నదులు, రిజర్వాయర్లకు సంబంధించి నీటి వనరులపై చర్చిం చారు. కమిషనర్‌ మాట్లాడుతూ నగర పరిధి రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో తాగునీటి శాశ్వత పరిష్కా రానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అమృత 2.0లో భాగంగా మున్సిపల్‌, ప్రజారోగ్య సాంకేతిక, గ్రామీణ తాగునీటి సరఫరా, జలవనరుల శాఖల అధికారులతో సమ న్వయ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు లకు అనుగుణంగా మూడు ప్రతిపాదనలు రూపొందించామన్నారు. తుంగభద్ర, హంద్రీ, గోరుకల్లు రిజర్వాయర్‌లపై ప్రాజెక్టుల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ ఆర్‌.రాంమోహనరెడ్డి, ఇరిగేషన ఎస్‌ఈ బాలచంద్రా రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ వి.అమల, పీడబ్ల్యూ డీఈ ప్రసాద్‌రావు, మున్సిపల్‌ ఇనచార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీఈఈలు గిరిరాజు, నరేష్‌, క్రిష్ణలత, ఏఈ జనార్దన, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 12:44 AM