అల్లర్లకు పాల్పడితే చర్యలు : సీఐ
ABN , Publish Date - Sep 22 , 2025 | 01:01 AM
గ్రామాల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుం టామని కొలిమిగుండ్ల సీఐ మద్దినేని రమేష్‌బాబు హెచ్చరించారు.
కొలిమిగుండ్ల, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుం టామని కొలిమిగుండ్ల సీఐ మద్దినేని రమేష్‌బాబు హెచ్చరించారు. ఆదివారం మండలంలోని ఎర్రగుడి గ్రామంలో సీఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో కార్డన సెర్చ్ నిర్వహించారు. ఎస్‌ఐ గోపాల్, ఏఎస్‌లు బాబా ఫకృద్దీన, గోవింద నాయక్, పోలీసులు వీధుల్లో కవాతు నిర్వహించి, అనుమానస్పద ప్రదేశాలు, ఇళ్లలో తని ఖీలు చేపట్టారు. అనంతరం గ్రామస్థులకు సీఐ అవ గాహన సదస్సు నిర్వహించారు.