పొగాకు కంపెనీలపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - May 07 , 2025 | 12:45 AM
పొగాకు పంటను కొనుగోలు చేయ కుండా రైతులను ఇబ్బంది పెడుతున్న కంపెనీలపై చర్యలు తీసు కోవాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఓర్వకల్లు, మే 6(ఆంధ్రజ్యోతి): పొగాకు పంటను కొనుగోలు చేయ కుండా రైతులను ఇబ్బంది పెడుతున్న కంపెనీలపై చర్యలు తీసు కోవాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం ఓర్వకల్లులోని పొగాకు గోడౌన్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న, సీఐటీయూ మండల నాయకులు సుధాకర్ మాట్లాడు తూ గత సంవత్సరం రైతుల వద్ద పొగాకు కంపెనీలు సమావేశాలు ఏర్పాటు చేసి పొగాకును పండించాలని చెప్పి.. ప్రస్తుతొం పొగాకు ఎక్కువైందని, కొనుగోలు చేయడం లేదని చెప్పడం సరైన పద్ధతి కాదని అన్నారు. గత ఏడాది క్వింటం రూ.16వేల నుంచి రూ.18వేల వరకు కొనుగోలు చేశారని, ఈ ఏడాది పొగాకు దిగుబడి ఎక్కువ కావడంతో రూ.10వేల నుంచి రూ.12వేల ధర వేస్తున్నారన్నారు. చిన్నసన్న కారు రైతులను ప్రైవేటు కంపెనీలు మోసం చేసి రూ.కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ నెల 8న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టే ధర్నాకు పొగాకు రైతులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పొగాకు రైతులు తది తరులు పాల్గొన్నారు.