ఆ ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:52 PM
కోర్టు నిబంధనలు ఉల్లం ఘించిన చిప్పగిరి, పత్తికొండ ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలని, అప్పటి దాకా ఉద్యమం ఆగదని పత్తికొండ న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు మఽ దు, న్యాయవాదులు సురేశ్‌కుమార్, ఎల్లారెడ్డి అన్నారు.
పత్తికొండలో సంకెళ్లతో న్యాయవాదులు వినూత్న నిరసన
పత్తికొండ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): కోర్టు నిబంధనలు ఉల్లం ఘించిన చిప్పగిరి, పత్తికొండ ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలని, అప్పటి దాకా ఉద్యమం ఆగదని పత్తికొండ న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు మఽ దు, న్యాయవాదులు సురేశ్‌కుమార్, ఎల్లారెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి నాలుగు స్తంభాల కూడలి వరకు సంకెళ్లతో సోమవారం న్యాయవాదులు వినూత్న రీతిలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం నాలుగు స్తంభాల కూడలి వద్ద ధర్నా చేశారు. వారు మాట్లాడు తూ న్యాయవ్యవస్థనే కించపరిచేలా చిప్పగిరి, పత్తికొండ ఎస్‌ఐలు కోర్టు హాలు నుంచి నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లడంతో పాటు అడ్డువచ్చిన న్యాయవాదులను తోసివేశారని, కోర్టు నిబంధనలు ఉల్లంఘించిన ఘటనపై పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో పత్తికొండ న్యాయవాదులు ఉన్నారు.