ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:47 PM
ఆరోగ్యశ్రీ రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవా లని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, నాగేష్, జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్లా, మండల కార్యదర్శి ప్రకాష్, సహాయ కార్యదర్శి హరికిషన రెడ్డి కలెక్టర్ రంజితబాషాకు వినతిపత్రం అందజేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు డీవైఎఫ్‌ఐ నాయకుల వినతి
కర్నూలు కలెక్టరేట్, జూన 2(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవా లని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, నాగేష్, జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్లా, మండల కార్యదర్శి ప్రకాష్, సహాయ కార్యదర్శి హరికిషన రెడ్డి కలెక్టర్ రంజితబాషాకు వినతిపత్రం అందజేశారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో హార్ట్, ఆర్థో సర్జరీల కోసం జాయిన అయినా ఆరోగ్యశ్రీ రోగుల నుంచి కనీసం రూ.10వేలు నుంచి రూ.80వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఫ జిల్లాలో ఉన్న ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై విచారణ జరిపించాలని రిపబ్లికన స్టూడెంట్ ఫెడరేషన (ఆర్‌ఎస్‌ఎఫ్) జిల్లా కార్యదర్శి మహేష్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. వసతులు లేని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల పర్మిషన రద్దు చేయా లని కోరారు. నగర అధ్యక్షుడు మధు, రాజేష్, కిరణ్ ఉన్నారు.
ఫ పొగాకు పంటను కంపెనీ వారు కొనుగోలు చేయాలని కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన రైతులు మధు, మారన్న, జగదీష్, రాజు కలెక్టర్‌ను కోరారు. ఐటీసీ కంపెనీ వారు పొగాకు పంట వేయమని చెప్పాడంతో పంట వేశామని, బార్లీ రకం పొగాకు కొంత కంపెనీ వారు కొనుగోలు చేశారని, మిగిలిన పొగాకును కొనాలని కోరితే కొనడం లేదని వాపోయారు.