Share News

హాస్టల్‌ వార్డెన్లపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jul 22 , 2025 | 12:15 AM

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్‌ మరమ్మతులకు నిధులు విడుదల చేసిందని, వాటిని వినియోగించకోకుండా స్వాహా చేసిన హాస్టల్‌ వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఉదయ్‌ కుమార్‌ కలెక్టర్‌ రంజిత బాషాకు వినతిపత్రం అందజేశారు.

హాస్టల్‌ వార్డెన్లపై చర్యలు తీసుకోవాలి
కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తున్న నాయకులు

కర్నూలు కలెక్టరేట్‌, జూలై 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్‌ మరమ్మతులకు నిధులు విడుదల చేసిందని, వాటిని వినియోగించకోకుండా స్వాహా చేసిన హాస్టల్‌ వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఉదయ్‌ కుమార్‌ కలెక్టర్‌ రంజిత బాషాకు వినతిపత్రం అందజేశారు. ఉదయ్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమ హాస్టల్‌ మరమ్మతుల కోసం కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. వార్డెన్లు హాస్టల్‌లో ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదని ఆరోపించారు. ఆ నిధులను స్వాహా చేశారన్నారు. అవినీతికి పాల్పడిన హాస్టల్‌ వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్యన సందీప్‌ ప్రేమ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

సీఆర్‌టీల అక్రమ రెగ్యులరైజేషన రద్దు చేయాలి: జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న సీఆర్‌టీల అక్రమ రెగ్యుల రైజేషన రద్దు చేయాలని ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రూప్లా నాయక్‌, ప్రసన్నలక్ష్మి, పెద్దయ్య, సీఆర్‌టీ ఉపాధ్యాయులను అక్రమంగా గత గిరిజన సంక్షేమ శాఖాధికారిగా పని చేసిన శ్రీనివాసకుమార్‌ రెగ్యులరైజేషన చేశారు. డీఎస్సీ ద్వారా సెలెక్ట్‌ అయి గత కొన్ని సంవ త్సరాలుగా రెగ్యులర్‌ ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రమోషన రావడం లేదన్నారు.

బోగస్‌ గిరిజన ఉద్యోగులను తొలగించాలి: జిల్లాలో బోగస్‌ గిరిజన ఉద్యోగులను తొలగించాలని ట్రైబల్‌ స్టూడెంట్‌ ఫెడరేషన రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప కలెక్టర్‌కు వినతిపత్రం అంద జేశారు. చంద్రప్ప మాట్లాడుతూ జిల్లాలో చాలా మంది బోగస్‌ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నార న్నారు. వారిపై విచారణ చేపట్టాలని కోరారు.

కల్లూరు తహసీల్దార్‌పై చర్యలు తీసుకోండి: కల్లూరు తహసీ ల్దార్‌ ఆంజనేయులుపై చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నగరానికి చెందిన షేక్‌ మహబూబ్‌బీ కలెక్టర్‌ రంజిత బాషాను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ కారల్‌ మార్క్స్‌నగర్‌లో ఉన్న ప్రభు త్వ ఇంటి పట్టాను 2022లో కుటుంబ సభ్యులు నాకు ఇచ్చారన్నారు. ఆస్తి కోసం మా అన్న 2023లో ఇంటి నుంచి బయటకు పంపించారన్నారు. అనంతరం మా అన్న నా పేరుపై ఉన్న ప్రభుత్వ ఇంటి పట్టాను, కరెంటు బిల్లు, ఇం టి పన్ను మార్చారని తెలిపారు. ప్రభుత్వ పట్టాను మార్చిన వీఆ ర్వోలు ఖాదర్‌బాషా, మహేశ్వరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Jul 22 , 2025 | 12:15 AM