సమన్వయంతో కార్యాచరణ
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:02 AM
న్యాక్‌లో గ్రేడ్ సాధించే దిశగా అన్ని విభాగాల హెచ్‌వోడీలు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకున్నామని ఆర్‌యూ వీసీ వెంకట బసవరావు అన్నారు.
ఆర్‌యూ వీసీ వెంకట బసవరావు
కర్నూలు అర్బన్, జూన్ 2(ఆంధ్రజ్యోతి): న్యాక్‌లో గ్రేడ్ సాధించే దిశగా అన్ని విభాగాల హెచ్‌వోడీలు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకున్నామని ఆర్‌యూ వీసీ వెంకట బసవరావు అన్నారు. సోమవారం రాయలసీమ యూనివ ర్సిటీలోని కాన్ఫరెన్స్ హాల్‌లో అన్నివిభాగాల హెచ్‌వోడీలు, రెక్టార్ ఎన్‌టీకే నాయక్, రిజిస్ట్రార్ బోయ విజయ కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్య, వసతులే లక్ష్యంగా కొత్త ఏడాది ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని అన్నారు. వనరులు, సౌకర్యాల్లో పురోగతి సాధించేందుకు లక్ష్యాలను నిర్దేశించామని తెలిపారు. క్యాంటమ్ టెక్నాలజీ, పునరుత్పా దక శక్తి వనరులు, డ్రోన్ టెక్నాలజీకు సంబందించి క్యాంపస్‌లో విద్యార్థులకు సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించామన్నారు. డీన్‌లు సుందరానంద పుచ్చా, భరత్, పరీక్షల విభాగం సీవీ కృష్ణారెడ్డి, కంట్రోలర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, పీఆర్‌వో రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీలో డ్యూయల్ కోర్సులకు సిద్దం కండి
డిగ్రీ కోర్సులను సింగిల్ మేజర్ కోర్సుల నుంచి డ్యూయల్ మేజర్ కోర్సులుగా మార్పు చేయడంతో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఉపకులపతి వి. వెంకట బసరావు అన్నారు. సోమవారం రాయలసీమ యూనివర్సిటీ కాన్పరెన్సు హాలులో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలకు అనుబంధంగా ఉన్న డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ డ్యూయేల్ మేజర్ సబ్జెక్టులుగా కాలేజీలు అందించే కోర్సులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఈ డ్యూయల్ మేజర్ విధానానికి మారనున్న డిగ్రీ కోర్సులకు విద్యార్థులను ప్రోత్సహించాలని ఆయన ప్రిన్సిపాళ్లను కోరారు.