బాలికల సాధికారతకు కార్యాచరణ
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:49 PM
కిషోర వికాసం కింద యుక్త వయస్సు బాలికల సాధికారతకు గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కర్నూలు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.నిర్మల పేర్కొన్నారు.
ఐసీడీఎస్ పీడీ డాక్టర్ నిర్మల
కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల జోనల్ సదస్సు
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): కిషోర వికాసం కింద యుక్త వయస్సు బాలికల సాధికారతకు గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కర్నూలు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.నిర్మల పేర్కొన్నారు. నగర శివారులోని జీవసుధ ప్రాంగణంలో కిషోర వికాసంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల నుంచి నోడల్ ఆఫీసర్లు, సీడీపీవో, డీసీపీవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ మాట్లాడుతూ బాల్య వివాహాలను నివారించడానికి అన్నిశాఖలతో కలిసి ముందుకు వెళ్లాలన్నారు. కడప జిల్లా జీసీడీవో అనిత మాట్లాడుతూ వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. కడప జిల్లా మెఫ్మా సీఈవో కల్పన మాట్లాడుతూ గ్రామంలో మహిళా సాధికారిత కోసం ఎస్‌జీ సంఘ సభ్యుల ద్వారా చర్చించాలన్నారు. కర్నూలు జిల్లా మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో హోంశాఖలో బాలల, మహిళల పరిరక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. అనంతరం యునెసెఫ్ ప్రతినిధులు జాన్స్, నరసింహమూర్తి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ స్టేట్ ఆఫీసర్ కమల్‌కుమార్ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీపీవో టి.శారద, డీసీపీఓ సిబ్బంది శ్రీలక్ష్మి, దీప, గీతా, పద్మ, నరసింహులు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.