Share News

శాంతి భద్రతలకు విఘాతం కలిగిత్తే చర్యలు

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:56 PM

ఆదోని, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదోని టూ టౌన్‌ సీఐ రాజశేఖర్‌ రెడ్డి ఎస్సై రామనాథ్‌ హెచ్చరించచారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిత్తే చర్యలు
రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న సీఐ

ఆదోనిలో క్షరౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్‌

ఆదోని, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదోని టూ టౌన్‌ సీఐ రాజశేఖర్‌ రెడ్డి ఎస్సై రామనాథ్‌ హెచ్చరించచారు. ఆదివారం పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. రౌడీషీట్‌ ఉండి ఇటీవల నేరాలకు పాల్పడని వారి కుటుంబ పరిస్థితులు, జీవన విధానం అడిగి తెలుసుకున్నారు. సత్‌ప్రవర్తన ఉంటే రౌడీ షీట్లు తొలగిస్తామని భరోసా ఇచ్చారు. కాలనీల్లో రౌడీషీటర్లపై విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ సాధా రణ ప్రజలకే కానీ నేరస్థులకు కాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే, హత్య కేసుల్లో నిందితులు దాడులు, బెదిరింపులకు పాల్పడితే ఊరుకోనని హెచ్చరించారు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని లేకపోతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

Updated Date - Mar 16 , 2025 | 11:56 PM