Share News

పాత ధరలకు విక్రయిస్తే చర్యలు

ABN , Publish Date - Oct 01 , 2025 | 11:48 PM

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించిందని, వ్యాపారులు పాత ధరలకే వస్తువులను విక్రియిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డా.ఏ.సిరి హెచ్చరించారు

పాత ధరలకు విక్రయిస్తే చర్యలు
రైతు బజార్‌లో వినియోగదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ డా.సిరి

జీఎస్టీ తగ్గించిన ధరలకే విక్రయించాలి

సి.క్యాంపు రైతు బజార్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌

కర్నూలు అగ్రికల్చర్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించిందని, వ్యాపారులు పాత ధరలకే వస్తువులను విక్రియిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డా.ఏ.సిరి హెచ్చరించారు. బుధవారం సి.క్యాంపు రైతుబజారులో నిత్వాసర దుకాణాలరె తనిఖీ చేశారు. గతంలో నిత్యావసరాల ధరలు, ప్రస్తుం ఇస్తున్న ధరలను ఆరా తీశారు. ధరల వివరాలను బోర్డులో నమోదు చేయాలన్నారు. జీఎస్టీ తగ్గింపును దుకాణాదారులు అమలుచేస్తున్నారో లేదో తనిఖీలు చేయాలని ఎస్టేట్‌ అధికారి కళ్యాణమ్మను ఆదేశించారు. హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ శివకుమార్‌ సివిల్‌ సప్లయ్‌ డీఎం రాజారఘువీర్‌, సెక్యూరిటీ గార్డులు శ్రీనివాసరెడ్డి, హనుమంతు, గోపాల్‌, చిన్నస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 11:48 PM