Share News

స్వర్ణాంధ్ర విజన్‌ 2047 లక్ష్యాలను సాధిద్దాం

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:17 AM

స్వర్ణాంధ్ర విజన్‌ 2047 లక్ష్యాలను సాధిద్ధామని ఎమ్మెల్యే పార్థసారథి పిలుపు నిచ్చారు. మంగళవారం రాత్రి మున్సిపల్‌ సమావేశ భవనంలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిం చారు.

స్వర్ణాంధ్ర విజన్‌ 2047 లక్ష్యాలను సాధిద్దాం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే పార్థసారథి

ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోని నియోజవకర్గ అభివృద్ధి, పీ-4 పాలసీపై అధికారులతో సమీక్ష

ఆదోని, జూలై 8 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర విజన్‌ 2047 లక్ష్యాలను సాధిద్ధామని ఎమ్మెల్యే పార్థసారథి పిలుపు నిచ్చారు. మంగళవారం రాత్రి మున్సిపల్‌ సమావేశ భవనంలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిం చారు. నియోజకవర్గ స్పెషల్‌ అధికారి, సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ అధ్యక్షత వహించగా, నియోజకవర్గ చైర్మన్‌గా ఎమ్మెల్యే పాల్గొన్నారు. పీ4 పాలసీ అమలు, ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతి, వనరుల వినియోగం, ప్రజలకు అందుతున్న సదుపా యాలపై అధికారులు నివేదికలను సమర్పిం చారు. సబ్‌కలెక్టర్‌ మాట్లాడుతూ అక్ష్యసా ధనకు అధికారులు కృషి చేయాలని సమష్టిగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లోకేశ్వరి, కమిషనర్‌ కృష్ణ, మెప్మా పీడీ లీలావతి, ఎంపీడీవో జనార్ధన్‌, అధికారులు పాల్గొన్నారు.

యూరియా కొరత లేకుండా చూడాలి

ఖరీఫ్‌ సీజన్లో యూరియా కొరత లేకుండా చూడాలని, వ్యవసాయ అధికారులను సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ ఆదేశించారు. మంగళవారం కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులు యూరియాను రైతుసేవా కేంద్రాలల్లో పొందేలా చర్యలు తీసుకోవాల న్నారు. అధిక ధరలకు విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. రైతులకు సమాచారాన్ని రైతుసేవా కేంద్రం ద్వారా తెలియజేయాలని ఆదేశించారు.

Updated Date - Jul 09 , 2025 | 12:17 AM