Share News

మెరుగైన ఫలితాలు సాధించండి

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:56 PM

చిప్పగిరిలో స్థానిక గవర్నమెంట్‌ హై స్కూల్‌లో డీఈవో శ్యామల్‌ పాల్‌ మంగళవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో 1 సావిత్రి, ఎంఈవోటు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

మెరుగైన ఫలితాలు సాధించండి
ప్యాడ్స్‌ అందజేస్తున్న డీఈవో

డీఈవో శ్యామూల్‌ పాల్‌

చిప్పగిరి మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : చిప్పగిరిలో స్థానిక గవర్నమెంట్‌ హై స్కూల్‌లో డీఈవో శ్యామల్‌ పాల్‌ మంగళవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో 1 సావిత్రి, ఎంఈవోటు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. డీఈవో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో మొత్తం 40వేల 776 విద్యార్థులు ఉన్నారని, 172 సెంటరులు ఏర్పాటు చేశామని, 172 మంది డిపార్టెమెంట్‌ ఆఫీసర్లను, 172 మంది అసిస్టెంట్‌ ఆఫీసర్లను ఏర్పాటు చేశామని, చిప్పగిరి మండలంలో 315 మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు. పిల్లలు అందరూ బాగా చదువుకొని మంచి ఉత్తీర్ణతతో సాధించాలని, చిప్పగిరి హైస్కూల్‌లో టెన్త్‌క్లాస్‌ స్టూడెంట్స్‌కు 99విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్స్‌, రబ్బర్సు, ప్యాడ్స్‌, డీఈవో చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్‌ లతీఫ్‌, టీచర్స్‌ నారాయణ స్వామి, మౌలాలి, రంగనాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 11:56 PM