వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:04 AM
పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు.
జేసీ నూరుల్ ఖమర్
కర్నూలు ఎడ్యుకేషన్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. తాను మెంటర్‌గా ఉన్న బి.క్యాంపు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. విద్యార్థులతో సంభాషించి విద్యాబోధన, పరీక్షలకు సిద్దమవుతున్న తీరును పరిశీలించారు. సబ్జెక్టులలో ముఖ్యమైన టాపిక్స్ గురించి పరీక్షలకు ఎలా సిద్దం కావాలని సూచనలు చేశారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ిసీ, డీ గ్రేడ్‌లో ఉండే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వంద రోజుల ప్రణాళికను ప్రకడ్బందీగా అమలు చేయాలని, రోజూ యూనిట్ టెస్టులను, స్లిప్ టెస్టులను నిర్వహించాలన్నారు.