విద్యుత్ శాఖపై ఏసీబీ దాడులు
ABN , Publish Date - May 17 , 2025 | 12:28 AM
విద్యుత్ శాఖపై ఏసీబీ అధికా రులు శుక్రవారం దాడులు నిర్వహించారు. డిప్యూటీ ఈఈ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
డిప్యూటీ ఈఈ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై కేసు
రుద్రవరం, మే 16 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ శాఖపై ఏసీబీ అధికా రులు శుక్రవారం దాడులు నిర్వహించారు. డిప్యూటీ ఈఈ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. వివరాలు.. మండలంలోని చిన్నకంబలూరు గ్రామానికి చెందిన రైతు లింగమూర్తి తన కుమారులైన శేఖ ర్, శివలింగంమూర్తి అనే ఇరువురి పేర్లపై ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభాల కోసం 21.5.2024 తేదీన దరఖాస్తు చేసుకున్నాడు. విద్యుత్ అధికారులు అంచనాలు సిద్ధంచేశారు. వాటికి సంబంధించి రూ.18640లు 3.7.2024లో రైతు చెల్లించాడు. విద్యుత్ డిప్యూటీ ఈఈ రవికాంత్‌చౌదరి వద్దకు వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాల కోసం సంప్రదించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రతాప్‌ను సంప్రదించాలని డిప్యూటీ ఈఈ సూచించారు. ప్రతాప్ రూ.40వేలు డిమాండ్ చేయగా రూ.30వేలకు బేరం కుదుర్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం రైతులు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ప్రతాప్‌కు రూ.30వేలు అందిం చారు. వెంటనే ఏసీబీ సిబ్బంది దాడిచేసి ఉద్యోగిని, నగదును స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ ఈఈతో పాటు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీఐలు క్రిష్ణయ్య, రాజ ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు, మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.