Share News

ఆధార్‌ అప్‌డేట్‌ వేగవంతం చేయాలి

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:49 AM

పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆధార్‌ అప్‌డేట్‌ను వేగవంతం చేయాలని డీఆర్‌డీఏ అధికారి శివారెడ్డి అన్నారు.

ఆధార్‌ అప్‌డేట్‌ వేగవంతం చేయాలి
ఆధార్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఆర్‌డీఏ అధికారి శివారెడ్డి

చాగలమర్రి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆధార్‌ అప్‌డేట్‌ను వేగవంతం చేయాలని డీఆర్‌డీఏ అధికారి శివారెడ్డి అన్నారు. శుక్రవారం చాగ లమర్రి బాలికోన్నత పాఠశాల, ముత్యాలపాడు ప్రాథమిక పాఠశా లలో ఏర్పాటు చేసిన ఆధార్‌ కేం ద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల నుంచి 15 సంవ త్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఆధార్‌ మానిటరీ, బయోమెట్రిక్‌ నమోదు చేయడానికి కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. అనంతరం పెద్దవంగలి గ్రామంలో తడి, పొడిచెత్త నిర్వహణ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్ర మంలో ఎంపీడీవో తాహిర్‌హుసేన, ఈవో తారకేశ్వరి, ఎంఈవో అనూరాధ, హెచఎం శివలక్ష్మీ, కో-ఆర్డినేటర్‌ రాజ్‌కుమార్‌, షేక్షావలి పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:49 AM