Share News

ఆధార్‌ అప్‌ డేట్‌ తప్పనిసరి

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:38 PM

: ప్రతి ఒక్కరూ ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్‌ పేర్కొన్నారు.

ఆధార్‌ అప్‌ డేట్‌ తప్పనిసరి
మాట్లాడుతున్న డీఆర్వో

డీఆర్వో రామునాయక్‌

నంద్యాల నూనెపల్లె, డిసెంబరు5(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి ఆధార్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. 5 నుంచి 15ఏళ్లు దాటిన పిల్లలు తమ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ తప్పనిసరిగా చేయించుకోవా లన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రైవేట్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడం, విద్యాసంస్థల్లో ప్రవే శం తదితర అవసరాలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి అన్నారు. ప్రస్తుతం బిడ్డపుట్టిన వెంటనే శిశువుకు కూడా ఆధార్‌ వచ్చేలా ఏర్పాట్లు చేశారన్నారు. ప్రతి శిశువుకు శిశు యాప్‌ ద్వారా తల్లిదండ్రుల ఆధార్‌ వివరాల ఆధారంగా తప్పనిసరిగా ఆధారు నంబరు నమోదు చేయాలన్నారు. ఈ ప్రక్రియను వైద్య ఆరోగ్య శాఖ, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో చేపట్టాలన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 11:38 PM