ప్రతి చిన్నారికి ఆధార్ తప్పనిసరి
ABN , Publish Date - May 24 , 2025 | 01:20 AM
చిన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు ఆధార్ నమోదు చేయించాలని నందికొట్కూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి సూచించారు.
నందికొట్కూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి
నందికొట్కూరు, మే 23 (ఆంధ్రజ్యోతి): చిన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు ఆధార్ నమోదు చేయించాలని నందికొట్కూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి సూచించారు. శుక్రవారం నందికొ ట్కూరు కోర్టు ఆవరణలోని మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ హాల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ తల్లిదండ్రులు తమ పిల్లలపైన బాధ్యతాయుతంగా ఉండాలని, పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. మిస్సింగ్ చిల్డ్రన్స వివరాలను సీడీపీవో, మండల విద్యాశాఖ అధికారులు, తహసీల్దార్, పోలీసు శాఖల వారు వారి బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో సాతి కమిటీని ఏర్పాటు చేసిందని ఈ కమిటీ ఆధార్‌లేని చిన్న పిల్లలకు ఆధార్ నమోదు చేయడం, న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం, ఉచిత న్యాయ సహాయం అందించడం ప్రధాన ఉద్దేశమన్నారు. జూలై 5న జాతీయ నేషనల్ లోక్ అదాలత నుంచి నందికొట్కూరు కోర్టులో నిర్వహించనున్నట్లు తెలిపారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్, సివిల్, ఫ్యామిలీ తగాదాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకో వాలని ఆమె సూచించారు. సమావేశంలో సీడీపీవో కోటేశ్వరమ్మ, లేబర్ ఆఫీసర్ షమీర్, న్యాయవాదులు వెంకటరాముడు, వెంకటేశ్వర్లు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.