Share News

ప్రతి రోగికి ఆధార్‌, అబా కార్డు తప్పనిసరి

ABN , Publish Date - May 02 , 2025 | 12:32 AM

ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి వారి వెంట ఆధార్‌, ఆబా కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్‌ డా.వీ. వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రతి రోగికి ఆధార్‌, అబా కార్డు తప్పనిసరి
ఆర్థో వైద్యులతో మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌

కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు

కర్నూలు హాస్పిటల్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి వారి వెంట ఆధార్‌, ఆబా కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్‌ డా.వీ. వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన పలు విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు ఓపీ, ఐపీ విభాగాలకు వచ్చే రోగులకు అందుతున్న వైద్యసేవల అభిప్రాయాన్ని క్యూఆర్‌ కోడ్‌లో నమోదు చేయాలని, దీనిపై రోగులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి రోగి వారివెంట ఆధార్‌, ఆబా కార్డులను తీసుకుని రావడంతో ఓపీ నమోదు ప్రక్రియ ఇతర ఏవలు వేగంగా జరుగుతాయన్నారు. బూతబంగ్లా, సర్జికల్‌, ఆర్థో విభాగంలోని ఆపరేషన థియేటర్‌లో పర్యటించి రోగులకు యూనిట్‌ వారీగా ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నారో ఆరాతీశారు. సూపరింటెండెంట్‌ వెంట డిప్యూటీ సూపరింటెండెంట్‌ డి.శ్రీరాములు, హాస్పిటల్‌ అడ్మినిస్ర్టే టర్‌ పి.సింధూ సుబ్రహ్మణ్యం, హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్స్‌ డాక్టర్‌ శివబాల నాగాంజన, కిరణ్‌ కుమార్‌, సునీల్‌ ప్రశాంత ఉన్నారు.

Updated Date - May 02 , 2025 | 12:32 AM