చంద్రబాబుకు ఘన స్వాగతం
ABN , Publish Date - Jul 18 , 2025 | 01:43 AM
నంద్యాల జిల్లా నందికొ ట్కూరు నియోజకవర్గం మల్యాల పంపింగ్ స్టేషన నుంచి రాయల సీమ జిల్లాల కు కృష్ణా జలాలను విడుదల చేసే కార్యక్రమానికి వెళ్లేం దుకు ఓర్వకల్లు విమానాశ్రయానికి గురువారం విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుకు విమానాశ్రయంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు.
భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
ఓర్వకల్లు, జూలై 17(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా నందికొ ట్కూరు నియోజకవర్గం మల్యాల పంపింగ్ స్టేషన నుంచి రాయల సీమ జిల్లాల కు కృష్ణా జలాలను విడుదల చేసే కార్యక్రమానికి వెళ్లేం దుకు ఓర్వకల్లు విమానాశ్రయానికి గురువారం విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుకు విమానాశ్రయంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు. వారిలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ రంజిత బాషా, ఎస్పీ విక్రాంత పాటిల్, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, కేఈ శ్యాంబాబు, కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కురువ సంక్షేమ డెవలప్‌మెంట్ కార్పొరేషన చైర్మన దేవేంద్రప్ప, రాష్ట్ర వాల్మీకి సంక్షేమ డెవలప్‌మెంట్ కార్పొరేషన చైర్మన కప్పట్రాళ్ల బొజ్జమ్మ, పీఏసీఎస్ చైర్మన రమణ, ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్ చైర్మన పూల నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, మాజీ ఎంపీ సంజీవ కుమార్, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మంత్రాలయం టీడీపీ ఇనచార్జి రాఘవేంద్రరెడ్డి, ఆలూరు ఇనచార్జి వీరభద్రగౌడు, టీడీపీ నాయకులు తుగ్గలి నాగేంద్రతో పాటు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ విద్యాసాగర్, విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, నాయకులు పార్వతమ్మ, విశ్వేశ్వరరెడ్డి, పెరుగు పురుషోత్తంరెడ్డి, దేశం సత్యనా రాయణ, ఆర్డీవో సందీప్ కుమా ర్, తహసీల్దార్లు, విద్యాసాగర్, ఆంజనే యులు, డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐ చంద్రబాబు నాయుడు ఉన్నారు. విమానాశ్రయం వద్ద దాదాపు 15 నిమిషాలపాటు చంద్రబాబు ప్రజాప్రతినిధులు, అధికారులతో ముచ్చ టించారు.
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రికి ఆత్మీయ వీడ్కోలు: నంద్యాల జిల్లా పర్యటన ముగించుకుని సాయంత్రం తిరిగి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు అధికారులు, ప్రజాప్ర తినిధులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. తిరుగు ప్రయాణంలో కలెక్టర్ రంజిత బాషా, ఎస్పీ విక్రాంత పాటిల్, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నం ద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, బ్రాహ్మణపల్లె నాగి రెడ్డి, మోహన రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, నాగేశ్వరరెడ్డిలు సీఎంకు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్టు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్లారు.
సీఎం పర్యటన వివరాలు: చంద్రబాబు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు 12.40 గంటలకు చేరుకోగా, 12.55 గంటల పాటు ప్రజాప్రతినిధులు, అధికారులతో ముచ్చటించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి హెలిప్యా డ్‌లో మల్యాలకు వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని 4.44 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుని 4.58 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరానికి బయలుదేరి వెళ్లారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి చంద్రబాబు రానున్న సందర్భంగా జిల్లాలోని వివిద ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివ చ్చారు.