విజన ప్లానను రూపొందించాలి
ABN , Publish Date - May 09 , 2025 | 12:36 AM
అభివృద్ధి, సంక్షేమ సమ్మి ళితంగా విజన ప్లానను రూపొందించాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ బి.నవ్య
కర్నూలు న్యూసిటీ, మే 8(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమ సమ్మి ళితంగా విజన ప్లానను రూపొందించాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత సమా వేశ భవనంలో స్వర్ణాంధ్ర-2047లో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాల విజన కార్యాచరణ ప్రణాళిక, నియోజకవర్గాల వారీగా వర్క్ షాప్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విజన ఆంధ్ర లో ఉండే పది సూత్రాలు జీరో పవర్టీ, అగ్రికల్చర్ సెక్టార్, వాటర్ సెక్యూరిటీ, స్కిల్ డెవపల్‌మెంట్, సోషల్ సెక్యూరిటీ ఆవిధంగా అభివృద్ధి, సంక్షేమ సమ్మిళితంగా విజన ప్లాన రూపొందించాలన్నారు. సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో దేశంలోనే మొదటి స్థానంలోనే ఉన్నామ న్నారు. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ అడ్వైజర్ సీతాపతిరావు మాట్లాడుతూ విజనలో భాగంగా నియో జకవర్గస్థాయిలో ప్రణాళిక ఏవిధంగా రూపొం దించుకోవాలనే విష యంపై ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. యాక్షన ప్లాన ఏవిధంగా తయారు చేయాలనే విషయాన్ని పీపీటీ ద్వారా హాజరైన సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, సీపీవో హిమ ప్రభాకర్‌రాజు, కర్నూలు ఆర్‌డీవో సందీప్‌కుమార్, పత్తికొండ ఆర్‌డీఓ భరత, నంద్యాల సీపీఓ వేణు గోపాల్, నగరపాలక అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవి.కృష్ణ, ఎంపీడీవోలు పాల్గొన్నారు.