వల్లభాయ్ పటేల్‌కు ఘన నివాళి
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:44 PM
జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో పటేల్ చిత్రపటానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు, జేసీ నూరుల్ ఖమర్, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ
కర్నూలు కలెక్టరేట్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో పటేల్ చిత్రపటానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు, జేసీ నూరుల్ ఖమర్, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారులతో కలిసి జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. ‘మై భారత్ సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సర్దార్ 150 యూనిటీ మార్చ్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పాలన దక్షత, నీతి నిజాయితీ, ధృఢసంకల్పం,వాస్తవ దృక్పథం, భవిష్యత్తు పట్ల దూరదృష్టి గల వ్యక్తి అన్నారు. కార్యక్రమంలో సెట్కూరు సీఈవో డా.వేణుగోపాల్, డీఆర్వో వెంకట నారాయణమ్మ, మై భారత్ సెంటర్ జిల్లా యువజన అధికారి రాహుల్ రెడ్డి, సీపీవో భారతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.