Share News

కవయిత్రి మొల్లకు నివాళి

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:55 PM

సంస్కృత రామాయణాన్ని తెలుగుభాషలోకి అనువదించిన తొలి వెలుగు కవయిత్రి మొల్ల అని కలెక్టర్‌ రంజిత్‌ బాషా పేర్కొన్నారు. మొల్లమాంబ జయంతిని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు.

కవయిత్రి మొల్లకు నివాళి
నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు ఎడ్యుకేషన్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): సంస్కృత రామాయణాన్ని తెలుగుభాషలోకి అనువదించిన తొలి వెలుగు కవయిత్రి మొల్ల అని కలెక్టర్‌ రంజిత్‌ బాషా పేర్కొన్నారు. మొల్లమాంబ జయంతిని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్‌ రంజిత్‌ బాషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణాన్ని సరళంగా అర్థమయ్యేలా తెలుగు బాషలోకి రచించిన విషయం అందరు స్మరించుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. వ్యవహారికభాషలో అందరికీ అర్థమయ్యే విదంగా రామయాణాన్ని చక్కగా వివరించడంలో ఆమె పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌, ఆఫీసు సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు సుగూరు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు సోమేష్‌, నాయకులు నాగేశ్వరరావు, బజారప్ప, కేసీ నాగన్న, లింగన్న, మఽధు, రామచంద్ర, నరసింహబాబు, వేంపెంట రాంబాబు, వలసల రామకృష్ణ, వెంకటేశ్‌, ధనుంజయ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 11:55 PM