Share News

నెహ్రూకు ఘన నివాళి

ABN , Publish Date - May 28 , 2025 | 12:14 AM

జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

నెహ్రూకు ఘన నివాళి
నెహ్రూ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కర్నూలు అర్బన, మే 27(ఆంధ్రజ్యోతి): జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేక్‌ జిలాని బాషా మాట్లాడుతూ ప్రజాస్వామ్య సౌధానికి జవహర్‌లాల్‌ నెహ్రూ నిర్మాత అని, ప్రధానిగా దేశానికి చేసిన సేవలు మరువలేని కొనియాడారు. నాయకులు దామోదరం రాధాకృష్ణ, ఐనటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.బతుకన్న, సాంబశివుడు, షేక్‌ ఖాజా హుస్సేన, లాజరస్‌, రాజేంద్రప్రసాద్‌, అనంత రత్నం మాదిగ పాల్గొన్నారు.

కర్నూలు కల్చరల్‌: జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థలో మంగళ వారం భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతిని నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. ప్రకాశ ముఖ్య అతిథిగా విచ్చేసి తొలుత నెహ్రూ, కందుకూరి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మహనీయుల అడుగుజాడల్లో విద్యార్థులు నడవాలని సూచిం చారు. అనంతరం గ్రంథాలయ సంస్థలో కొనసాగుతున్న బాలల వేసవి శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. శిక్షణ తరగతుల అధ్యాపకులు సుధీర్‌రాజు, యాగంటీశ్వరప్ప, గ్రంథాలయ సంస్థ ఉప గ్రంథాలయ అధికారి వి.పెద్దక్క, లైబ్రేరియన్లు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2025 | 12:14 AM