టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:29 AM
పత్తికొండ నియోజకవర్గంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా రైతులను ఆదుకోవచ్చని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు.
వ్యాపారుల కుమ్మక్కుతో రైతులకు అన్యాయం
కిలో రూ.25 చొప్పున కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
పత్తికొండలో పర్యటించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
పత్తికొండ టౌన్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ నియోజకవర్గంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా రైతులను ఆదుకోవచ్చని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం శ్రీనివాసరావుతో పాటు సీపీఎం, రైతు సంఘాల బృందం నాయకులు పత్తికొండ టమోటా మార్కెట్‌ను సందర్శించారు. అక్కడ టమోటా ధరలపై రైతులను బృందం నాయకులు అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంటలను సాగుచేస్తే సరైన ధర లేక తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోందని పలువురు టమోటా రైతులు బృందం నాయకులకు రైతులు గోడును వివరించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యాపారుల సిండికేట్‌తో టమో టా రైతులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. రైతులను ఆదు కుంటామని, మద్దతు ధర ఇస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రగ ల్భాలు పలుకుతున్నప్పటికీ పంటలు చేతికొచ్చే సమయంలో ధరలు పత నమై తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. పత్తికొండ టమోటా మార్కె ట్‌లో తీసుకొచ్చిన టమోటాలు నాణ్యతపరంగా ఉన్నాయని, అయితే హైదరాబాద్‌లో కిలో టమోటా రూ.50 ధర పలికితే పత్తికొండ మా ర్కెట్‌లో కిలో రూ.5 కూడా కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందని అన్నా రు. మార్క్‌ఫెడ్ అధికారులు పర్యవేక్షించి టమోటాకు గిట్టుబాటు ధర కల్పించేలా చొరవ చూపాలన్నారు. కిలో టమోటాను రూ.25 చొప్పున కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, సీపీఎం మండల కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు రంగారెడ్డి, రవిచంద్ర వీరశేఖర్, సిద్ధయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.