పాలకొలను సర్పంచుకు అరుదైన గౌరవం
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:01 AM
ఓర్వకల్లు మండలంలోని పాలకొలను గ్రామ సర్పంచు చదువుల సుజాతమ్మకు అరుదైన గౌరవం లభించింది.
ఓర్వకల్లు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లు మండలంలోని పాలకొలను గ్రామ సర్పంచు చదువుల సుజాతమ్మకు అరుదైన గౌరవం లభించింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు గురువారం ఆమె విమానంలో బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా సర్పంచు చదువుల సుజాతమ్మ మెమొంటోను అందుకున్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో ఆమె పాల్గొంటారు.