Share News

ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:38 AM

పట్టణంలో ట్రాఫిక్‌ సమ స్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

డోన టౌన, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ట్రాఫిక్‌ సమ స్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని 9వ వార్డులో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు రచ్చబండ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీల ను స్వీకరించారు. త్వరితగతిన ప్రజా సమస్యలను సంబం ధిత అధికారు లను ఆదేశించారు. పాత ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. రైల్వేగేట్లతో ఏర్పడుతున్న ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వతంగా ఫ్లైఓవర్‌ సంబందించిన ర్యాంప్‌ నిర్మాణ పను లను త్వరలో ప్రారంభిస్తా మన్నారు. పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా మన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్రికే ఫణిరాజ్‌, కేడీసీ ఎంఎస్‌ చైర్మన వై.నాగేశ్వరరావు యాదవ్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన టీఈ కేశన్నగౌడు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన కోట్రికే హరికిషణ్‌, టీడీపీ పట్టణ అద్యక్షులు టీఈ రాఘ వేంద్రగౌడు, పీఏసీఏసీ చైర్మన ఎల్లగౌడు, మాజీ సర్పంచ పెద్దకేశవయ్య గౌడు, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, జిలేబీ ధను, తోట మనోహర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 12:38 AM