Share News

ఐకమత్యంతో సాగితే నవ సమాజం

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:37 PM

ఐక్యమత్యంగా ముందుకు సాగి, నవసమాజాన్ని నిర్మిద్దామని సీఎస్‌ఐ నంద్యాల డయాసిస్‌ బిషప్‌ రైట్‌ రెవ. డాక్టర్‌ కె.సంతోష్‌ ప్రసన్నరావు ఉద్బోధించారు.

ఐకమత్యంతో సాగితే నవ సమాజం
సన్మానించుకుంటున్న బిషప్‌లు

సీఎస్‌ఐ నంద్యాల డయాసిస్‌ బిషప్‌ సంతోష్‌ ప్రసన్నరావు

నగరంలో ‘ఐక్య క్రిస్మస్‌’ వేడుకలు

కర్నూలు కల్చరల్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి):ఐక్యమత్యంగా ముందుకు సాగి, నవసమాజాన్ని నిర్మిద్దామని సీఎస్‌ఐ నంద్యాల డయాసిస్‌ బిషప్‌ రైట్‌ రెవ. డాక్టర్‌ కె.సంతోష్‌ ప్రసన్నరావు ఉద్బోధించారు. ఆదివారం కోల్స్‌ కళాశాల మైదానంలో కర్నూలు సిటీ పాస్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఐక్య క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. యూపీసీఎంఏకేసీ చీఫ్‌ ప్యాట్రన్‌ రెవ. డాక్టర్‌ కేజే విజయకుమార్‌ అధ్యక్షత వహించారు. ఆర్‌సీఎం బిషప్‌ మహాఘన జ్వాన్నేష్‌ హాజరయ్యారు. 2024 ఏళ్ల క్రితం క్రీస్తు జన్మించిన సందర్భాన్ని, ఆయన లక్ష్యాన్ని గుర్తు చేశారు. పేదలు, అనాథలను ఆదుకోవాలని, సేవాతత్పరత గుణాన్ని కలిగి ఉండాలని సూచించారు. పాస్టర్‌ షాలేం రాజు ఆధ్వర్యంలో పాడిన పాటలు అలరించాయి. పాస్టర్‌ కె. ప్రతాపరెడ్డి, సిటీ పాస్టర్స్‌ అసోసియేషన్‌ చీఫ్‌ ప్యాట్రన్‌ రెవ. డాక్టర్‌ ఆర్‌ఆర్‌డీ సజీవరాజు, కేసీఈపీఏ చీఫ్‌ ప్యాట్రన్‌ రెవ. బోనాల శశికుమార్‌, హోసన్న మందిరం పాస్టర్‌ ఫెడ్రిక్‌ పాల్‌, కర్నూలు సిటీ పాస్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శామ్యూల్‌ రాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:37 PM