పెద్ద హరివాణం తగదు
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:57 PM
పెద్దహరివాణం మండలం ఏర్పాటుపై ఆదోని మండలంలోని 16 గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనా క్షినాయుడుకు ఆదివారం వినతి పత్రం అందజేశారు.
మండలాన్ని రద్దు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తాం
16 గ్రామాల నాయకులు, ప్రజలు మాజీ ఎమ్మెల్యేకు వినతి
ఆదోని, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పెద్దహరివాణం మండలం ఏర్పాటుపై ఆదోని మండలంలోని 16 గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనా క్షినాయుడుకు ఆదివారం వినతి పత్రం అందజేశారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణ యం తీసుకోకుండా తమ గ్రామాలను పెద్దహరివాణం మండలంలో చేర్చితే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని 16 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యేను హెచ్చరించారు. ఈ సంద ర్భంగా గ్రామ నాయకులు తమ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజల ఆకాంక్షలను విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసు కుంటే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరి స్తామ ని మీనాక్షినాయుడుకు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వారు మీనాక్షినాయుడిని కోరారు. 16 గ్రామాల నేతలు నారాయణం ఎంపీటీసీ ఉల్తెప్ప, బసాపురం రామస్వామి, గోపాల్‌రెడ్డి, ఢణాపురం శేషన్న, మల్లికార్జున, ఈరన్నగౌడ్, చాగి గులెప్ప పాల్గొన్నారు.