Share News

సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి

ABN , Publish Date - May 29 , 2025 | 12:50 AM

మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు మరో 28మంది హత్య లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వామపక్ష, ప్రజాసంఘాల, మానవ, పౌరహక్కుల సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి
మాట్లాడుతున్న నాయకులు

ఆపరేషన కగార్‌ పేరుతో సాగిస్తున్న నరమేధాన్ని ఆపాలి

వామపక్ష, ప్రజాసంఘాలు డిమాండ్‌

ఎమ్మిగనూరు, మే 28(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు మరో 28మంది హత్య లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వామపక్ష, ప్రజాసంఘాల, మానవ, పౌరహక్కుల సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆపరేషన కగార్‌ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 500మంది మావోయిస్టులను కేంద్ర బలగాలు పొట్టన పెట్టుకున్నాయన్నారు. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు ముందుకు వచ్చినా కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా నర మేధాన్ని కొనసాగించడం సరికాదన్నారు. ఆపరేషన కగార్‌ను బేషర తుగా విరమించుకోవాలన్నారు. సమావేశంలో ఆయా సంఘాల నాయ కులు వెంకటేశ్వర్లు, దేవేంద్రబాబు, పంపన్నగౌడ్‌, రాముడు,రాజు, ఏసేపు, మాల నరసపన్న, బతకన్న, రంగన్న, భాస్కర్‌ యాదవ్‌, తిమ్మ గురుడు, విజేంద్ర, జబ్బార్‌, మాలిక్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:09 PM