ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకోవాలి
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:38 PM
: సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం శాఖ మంత్రి టీజీ భరత్ సూచించారు.
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు హాస్పిటల్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం శాఖ మంత్రి టీజీ భరత్ సూచించారు. మంగళవారం నగరంలోని సంకల్‌బాగ్ విశ్వక్ గార్డెన్స్‌లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘బాలదంత సురక్ష’ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రోజూ ఉదయం, రాత్రి దంతాలను శుభ్రం చేసుకోవడం అవసరమన్నారు వ్యాయామం, క్రీడలు బాల్యం నుంచే అలవాటు చేసుకోవాలని సూచించారు. సోమిశెట్టి శ్రీకాంత్, నభూషా డెంటిస్టులు డాక్టర్ శ్వేత, డా.సునీత, డా.దివ్య, రజిత విభు, సేజన్, ఫర్జానా ఉన్నారు.