Share News

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN , Publish Date - May 29 , 2025 | 12:53 AM

నగర పాలక కార్యాల యంలో బుధవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కార్పొరేషన కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎన్టీఆర్‌కు ఘన నివాళి
టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

కర్నూలు న్యూసిటీ, మే 28(ఆంధ్రజ్యోతి): నగర పాలక కార్యాల యంలో బుధవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కార్పొరేషన కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ 1982లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ఖ్యాతిని ప్రపంచ దేశాలకు విస్తరింపజేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. పేదలకు రూ.2కే బియ్యం, తాలూకా వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ రూప కల్పన, మహిళలకు సమాన ఆస్తి వాటా హక్కు వంటి గొప్ప సంస్క రణలకు నాంది పలికారని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌రెడ్డి, మేనేజర్‌ చిన్నరాముడు, ప్రజా రోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, అకౌంట్స్‌ ఆఫీసర్‌ చుండీప్రసాద్‌, ఇనచార్జి ఎస్‌ఈ శేషసాయి, టీపీఆర్‌ఓ వెంకటలక్ష్మి, సూపరింటెం డెంట్లు రామకృష్ణ, స్వర్ణలత, మంజూర్‌ బాషా, సుబ్బన్న పాల్గొన్నారు.

ఫ జిల్లా పరిషత మినీ సమావేశ భవనంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి జడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జి.నాసరరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పెద్ద సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బారెడ్డి, అధికారులు సరస్వతమ్మ, నాగేంద్రప్ర సాద్‌, జితేంద్ర, పుల్లయ్య, బసవశేఖర్‌, ఉద్యోగులు ప్రసాద్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఫ జిల్లా పరిషత ఆవరణలోని విశ్వేశ్వరయ్య భవన పంచాయ తీరాజ్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయంలో ఎస్‌ఈ వి.రామచంద్రారెడ్డి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో కర్నూలు ఈఈ ఎస్‌సీఈ మద్దన్న, డిప్లమా ఇంజనీర్స్‌ అసో సియేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్ర, డీఈలు రవీంద్రనాథరెడ్డి, శ్రీనివాసులు, కర్రెన్న, ఏఈలు ముక్తార్‌, అమర్‌ పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి

కర్నూలు అర్బన: దివంగత మాజీ సీఎం ఎనటీ రామారావుకు భారత రత్న ఇవ్వాలని డీసీసీబీ చైర్మన, కోడుమూరు టీడీపీ ఇనచార్జి విష్ణువర్ధనరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విష్ణు వర్ధనరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రా భివృద్ధి సాధ్య మని గ్రహించి ప్రజలు మరో సారి టీడీపీకి అఖండ విజయాన్ని అందిం చారన్నారు. కార్యక్రమంలో పి.హరినాథ్‌చౌదరి, ఆర్‌. బాబురావు, పుల్లయ్య చౌదరి, ఎల్లప్ప పాల్గొన్నారు.

ఓర్వకల్లు: మండల కేంద్రమైన ఓర్వకల్లులో టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మండలంలోని కన్నమడకల, పూడిచర్ల, నన్నూరు, ఉయ్యాలవాడ, హుశేనాపురం, సోమయాజుల పల్లె తదితర గ్రామాల్లో టీడీపీ నాయకులు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, రామకో టేశ్వరరావు, అబ్దుల్లా, అల్లాబాబు, యాసీన బాషా, కురువ సుంకన్న, సంజీవ, రామకృష్ణ పాల్గొన్నారు.

సి.బెళగల్‌: సి.బెళగల్‌ ఎన్టీఆర్‌ పార్కులో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి టీడీపీ నాయకులు బాలాజీ వెంక టేశ, నల్లన్న తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో హనుమంతు, సోమేశ్వరరెడ్డి, బడెసా కర్రె తాత, కొండన్న పాల్గొన్నారు.

తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్‌

కర్నూలు కల్చరల్‌: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా దివంగత చలన చిత్ర కథానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎనటీ రామారావు నిలిచిపోతారని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య కొని యాడారు. బుధవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎనటీ రామా రావు జయంతిని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పత్తి ఓబుల య్య మాట్లాడుతూ పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో ఎనటీఆర్‌ తనదైన నటనతో కోట్లాది ప్రేక్షకుల ఆరాధ్యదైవంగా నిలిచారని శ్లాఘించారు. కార్యక్రమంలో కళాక్షేత్రం కార్యదర్శి మహమ్మద్‌మియా, ఇతర ప్రతినిధులు జీవీ శ్రీనివాసరెడ్డి, పి. రాజారత్నం, యర్రమ పాండురం గయ్య, వీవీ రమణారెడ్డి, యాగంటీశ్వరప్ప, బలరాముడు, కేవీ రమణ, ఈశ్వరయ్య, కృష్ణ, బాలవెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఫ ఎన్టీయార్‌ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.ప్రకాశ అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె.ప్రకాశ మాట్లాడుతూ ఎనటీఆర్‌ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్య క్షుడు కేజీ గంగాధరరెడ్డి, డిప్యూటీ లైబ్రేరియన వి.పెద్దక్క, లైబ్రేరి యన్లు వజ్రాల గోవిందరెడ్డి, ఎస్‌ బాషా, బసవరాజు, మగ్బుల్‌బాషా పాల్గొన్నారు.

కర్నూలు ఎడ్యుకేషన్‌: స్థానిక బీ.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో బుధవారం ప్రిన్సిపాల్‌ డా.ఎస్‌.నాగస్వామి నాయక్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి ఆర్‌ఐవో ఎస్‌వీఎస్‌ గురువ య్యశెట్టి, ప్రిన్సిపాల్‌ నాగస్వామి నాయక్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రామకృష్ణ విజయ శేఖర్‌, కృష్ణమోహన, సోమేష్‌, పార్థసారధి, గిరిజారాణి, సుజాత పాల్గొన్నారు.

కర్నూలు రూరల్‌: కర్నూలు మండల పరిషత అభివృద్ధి కార్యాల యంలో బుధవారం ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఎంపీడీవో జి.రఘునాథ్‌, కార్యలయ పరిపాలనా ధికారి చంద్రశేఖర్‌ పాల్గొని ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ ముక్తార్‌ బాషా, సీనియర్‌ అసిస్టెంట్‌ రామకృష్ణ, వినోద్‌, విష్ణు పాల్గొన్నారు.

కర్నూలు క్రైం: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌ ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నారాయణ, ఏఆర్‌ పోలీసులు పాల్గొన్నారు.

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌: స్థానిక పొల్యూషన కంట్రోల్‌ బోర్డు కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీరు పీవీ కిషోర్‌ కుమార్‌ రెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్ర మంలో సీనియర్‌ పర్యావరణ శాస్త్రవేత్త బీరేంద్రకుమార్‌, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:10 PM