Share News

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:55 AM

కల్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది.

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
గురువులతో పూర్వ విద్యార్థులు

20 ఏళ్ల అనంతరం కలుసుకున్న స్నేహితులు

కల్లూరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): కల్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. శనివారం కల్లూరు జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ ఎం హుసేన్‌ ఆధ్వర్యంలో 2004-05 బ్యాచ్‌ విద్యార్థులు కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాఠశాల రోజుల్లో చేసిన చిలిపి పనులను గుర్తు చేసుకున్నారు. అనంతరం 2004-05 బ్యాచ్‌ విద్యార్థుల ఆర్గనైజర్స్‌ దామోదర్‌, మాబాషా, రమేష్‌, అంజి, నరసన్న, సుధాకర్‌, పరుశురాం, వాణి, శైలజ, ప్రసన్న, రేవతి ఆధ్వర్యంలో గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు రత్నం ఏసేపు, వాసుదేవయ్య, సాయిలీల, బాబయ్య, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 12:55 AM