ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:15 AM
ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
శిరివెళ్ల, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శిరి వెళ్లలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమ స్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. గ్రీవెన్సలో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత గడువు లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ డీవో శివ మల్లేశ్వరప్ప, తహసీల్దార్ విజయశ్రీ, మం డలంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.