Share News

కన్నుల పండువగా.. బసవేశ్వరస్వామి రథోత్సవం

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:01 AM

మండలంలోని జంపాపురం గ్రామంలో బసవేశ్వరస్వామి రథోత్సవం సోమవారం అశేష భక్తజన వాహిని మధ్య కన్నుల పండువగా నిర్వహించారు.

కన్నుల పండువగా.. బసవేశ్వరస్వామి రథోత్సవం
రథోత్సవానికి హాజరైన జనం

కోసిగి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని జంపాపురం గ్రామంలో బసవేశ్వరస్వామి రథోత్సవం సోమవారం అశేష భక్తజన వాహిని మధ్య కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు ఈశ్వరయ్య, ధర్మకర్త సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచే స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. బసవేశ్వరస్వామి ప్రత్యేక పుష్పాలంకరణలో ముస్తాబు చేశారు. బసవేశ్వరస్వామిని టీడీపీ, వైసీపీ నాయకులు వేరేవేరు సమయాల్లో దర్శించుకుని మొక్కులు తీర్చుకు న్నారు. ముందుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, మం త్రాలయం టీడీపీ యువ నాయకులు రామకృష్ణారెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్‌ రెడ్డిలు స్వామివారిని దర్శించుకుని తమ నాయకు లతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో స్వామి వారి రథోత్సవాన్ని అశేష భక్తజనవాహిని మధ్య ఊరేగించారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ చంద్రమోహన గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Mar 11 , 2025 | 01:01 AM